పోలీసుల అత్యుత్సాహానికి హైకోర్టు బ్రేకులు

February 13, 2018


img

రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు పాత నేరస్తుల డేటాతో కూడిన రికార్డ్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో సకల నేరస్తుల సమగ్ర సర్వే చేయాలనీ ఆదేశిస్తూ జనవరి 3న డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. అది మంచి ఉద్దేశ్యంతో చేసిన యోచనే అయినప్పటికీ కొందరు పోలీసుల అత్యుత్సాహం వలన పోలీస్ శాఖ హైకోర్టు చేత మొట్టికాయలు తిని దానిని నిలిపివేయవలసి వచ్చింది. 

గ్రేటర్ హైదరాబాద్ బిసి సెల్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బద్రీనాథ్ యాదవ్, అబ్దుల్ హఫీజ్ అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. పోలీసులు తమను బలవంతంగా స్టేషన్ కు తీసుకువెళ్ళి వేలిముద్రలు, ఫోటోలు తీశారని వారు తమ పిటిషన్లలో ఆరోపించారు. వాటిపై స్పందించిన హైకోర్టు సకల నేరస్తుల సమగ్ర సర్వేను నిలిపివేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వేను నిలిపివేస్తున్నట్లు అడ్వొకేట్‌ జనరల్ దేశాయ్‌ ప్రకాశ్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.      Related Post