వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం!

February 28, 2023
img

భారత్‌ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి తప్పుకొని చాలా కాలమే అయినప్పటికీ, నేటికీ దేశప్రజలలో ఆయనకున్న గుర్తింపు, గౌరవం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏప్రిల్ 23వ తేదీన సచిన్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. కనుక ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఆయన గౌరవార్ధం వాంఖడే స్టేడియంలో సచిన్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతోంది. సచిన్ టెండూల్కర్ అక్కడే తన చివరి మ్యాచ్ ఆడారు కనుక అక్కడే ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ భావించింది. ఈ ప్రతిపాదనకి సచిన్ కూడా అనుమతిచిన్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. వీలైతే ఏప్రిల్ 23న సచిన్ పుట్టిన రోజునాడు కుదరకపోతే ఈ ఏడాది చివర్లో స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు కానీ వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ ఖాలే చెప్పారు. 

భారతరత్న అవార్డు అందుకొన్న సచిన్ టెండూల్కర్‌కి ఇది మరో అరుదైన గౌరవమే కావచ్చు. అయితే సచిన్ టెండూల్కర్‌ని గౌరవించదలచుకొంటే ఆయన పేరిట ఏదైనా మ్యాచ్ నిర్వహించి ఆయన చేతే ట్రోఫీ ఇప్పిస్తే గొప్పగా ఉంటుంది కానీ జీవించి ఉన్నవారి విగ్రహాలు పెట్టడం ఆనవాయితీ కాదు. వారికీ అది మంచిది కాదని అప్పుడే కొందరు వాదిస్తున్నారు.  

Related Post