స్మితా సభర్వాల్‌పై మంత్రి సీతక్క ఫైర్

July 23, 2024


img

ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఉద్యోగాలలో వికలాంగుల కోటా అనవసరమన్నట్లు చేసిన వ్యాఖ్యలతో పెను వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై ఆమె ఇచ్చిన వివరణ పుండు మీద కారం జల్లిన్నట్లవడంతో ఆమెపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. మంత్రి సీతక్క సైతం ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“స్మితా సభర్వాల్ వికలాంగుల గురించి ఆవిదంగా మాట్లాడటం చాలా తప్పు. అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యమే ఎక్కువ ప్రమాదకరం. తనకు అన్నీ తెలుసనే అహంభావంతో ఆమె ఇతరుల అభిప్రాయాలను గ్రహించలేకపోవడంతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విదంగా ఆమె మాట్లాడిన మాటలు సరికాదు.

ఆమెలో ఫ్యూడల్ మనస్తత్వం కనిపిస్తోంది. ఆమె చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి. ఈవిదంగా మాట్లాడుతారనుకోలేదు. కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. ఈ వివాదం సిఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి వెళ్ళే ఉంటుందని భావిస్తున్నాను. లేకుంటే నేను  సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాదుతాను,” అని అన్నారు.       

స్మితా సభర్వాల్ మాత్రం తాను ఎవరినో బాధపెట్టాలనో లేదా వివాదం సృష్టించాలనో ఆవిదంగా మాట్లాడలేదని, యూపీఎస్సీలో సంస్కరణల కోసం కేంద్రం నా అభిప్రాయం అడిగినప్పుడు, రిజర్వేషన్ల విషయంలో నా అభిప్రాయం చెప్పాను. నా అభిప్రాయానికి నేను కట్టుబడి ఉన్నాను,” అని అన్నారు.


Related Post