ఓటమితో ఈ ముగింపు బాధాకరమే కానీ...

January 27, 2023
img

భారత్‌ టెన్నిస్ ఛాంపియన్ సానియా మీర్జా ముందే ప్రకటించిన్నట్లుగా ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్ డబుల్స్ పోటీలో చివరిసారిగా పాల్గొని గ్రాండ్ స్లామ్ పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. అయితే 2005లో తనకి 18 ఏళ్ళు వయసున్నప్పుడు ఎక్కడ తన కెరీర్‌ ప్రారంభించానో అక్కడే జీవితంలో చివరి గేమ్ ఆడి దానిలో విజయం సాధించి కెరీర్‌ ముగించాలని సానియా ఆశించారు. కానీ చివరి గేమ్‌లో ఓడిపోవడంతో ఓటమితో తన కెరీర్‌లో ముగించాల్సి వచ్చిందని సానియా భాధ పడ్డారు. అయితే తన చిన్నారి కొడుకు ఎదుట ఇంత పెద్ద గ్రాండ్ స్లామ్ ఫైనల్ పోటీలో ఆడతానని తాను ఎన్నడూ ఊహించలేదని కనుక ఈ చివరి గేమ్‌లో ఓడిపోయాననే బాధతో పాటు తన కొడుకు ఎదుట ఆడినందుకు ఎనలేని సంతోషం, సంతృప్తి కలిగించిందని సానియా అన్నారు. 

బ్రెజిల్ జోడీ చేతిలో సానియా జోడీ ఓడిపోయింది. 2009లో మహేష్ భూపతితో కలిసి సానియా తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ పోస్టర్‌ను గెలుచుకొన్నారు. ఆమె తన కెరీర్‌లో 43 డబుల్స్ టైటిల్స్, వాటిలో ఆరు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు సాధించారు. మహిళల డబుల్స్ పోటీలలో మూడు, మిక్స్ డబుల్స్ పోటీలలో మూడుసార్లు విజయం సాధించారు. సానియా కెరీర్‌లో ఇది 11వ మరియు చిట్టచివరి గ్రాండ్ స్లామ్. ఫిభ్రవరి నెలలో దుబాయ్‌లో జరుగబోయే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా మీర్జా టెన్నిస్ నుంచి పూర్తిగా రిటైర్ కాబోతోంది. 


Related Post