గేమ్ చేంజర్‌ పాటలో చిరంజీవి కనిపించారే!

December 22, 2024
img

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ చేంజర్‌’ నుంచి నాలుగో పాట ఆదివారం ఉదయం విడుదలైంది. ఈ ‘దోప్ సాంగ్‌’ని రామజోగయ్య వ్రాయగా తమన్ స్వరపరిచి రోషినీ, పృధ్వీ శ్రుతీ రంజనీలతో కలిసి పాడారు.

ముందుగా పాట లిరిక్స్ గురించి చెప్పుకుంటే దీనిని తెలుగు పాట అనడం కంటే ఇంగ్లీష్ పాట అంటేనే బాగుంటుందేమో? ‘సరస్వతీ పుత్ర’ అని బిరుదు తగిలించుకొని రామజోగయ్య శాస్త్రి ఈవిదంగా పాట వ్రాయడం విచిత్రంగా అనిపిస్తుంది. అయితే సినిమాలో సన్నివేశానికి అవసరమైన్నట్లు పాట వ్రాయాల్సి ఉంటుంది కనుక ఇలా వ్రాశారని సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. 

ఇక ఈ పాటలో రామ్ చరణ్‌ డాన్స్ మూమెంట్స్ చూస్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని తలపించారు. రామ్ చరణ్‌ చాలా అలవోకగా డాన్స్ చేశారు. పాట-బీట్ వింటున్నప్పుడు, రోబో సినిమాలో ‘ఇనుములో ఓ హృదయం.. ‘  పాట-బీట్ గుర్తు రాకమానదు. రెండూ పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ శంకర్ సినిమాలో ఓకే రకమైన ఇటువంటి ఓ పాట ఉంటుందనిపిస్తుంది. 

ఈ పాటకి కియరా అద్వానీ రామ్ చరణ్‌తో పోటీ పడి డాన్స్ చేసినప్పటికీ అందరి దృష్టిని రామ్ చరణ్‌ ఎక్కువగా ఆకర్షించారని చెప్పక తప్పదు. 

గేమ్ చేంజర్‌లో ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్‌ 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.

  

Related Post