సారీ... గేమ్ చేంజర్‌ అప్‌డేట్‌ ఇవ్వలేను: దిల్‌ రాజు

March 28, 2024
img

బుధవారం రామ్ చరణ్‌ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు గేమ్ చేంజర్‌ సినిమాకు సంబందించి ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేనని చెపుతూనే ఆ సినిమా గురించి చెప్పిన విశేషాలతో అభిమానులు ఉర్రూతలూగిపోయేలా చేశారు. 

“ఇప్పుడు రామ్ చరణ్‌ మీరందరూ అనుకొంటున్నట్లుగా మెగా పవర్ స్టార్‌ కాదు...గ్లోబల్ స్టార్‌ అయ్యారు.  ఆయన రేంజికి తగ్గట్లుగా దర్శకుడు శంకర్ ఈ గేమ్ చేంజర్‌ సినిమా తీస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. 4-5 నెలలో రిలీజ్ కూడా అవుతుంది. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడని అన్నాను అడగొద్దు. అడిగినా నేను చెప్పలేను. 

ఈ సినిమా అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో మీరందరూ చాలా నిరాశగా ఉన్నారని నాకు తెలుసు. కానీ శంకర్ పర్మిషన్ ఇచ్చే వరకు కనీసం గేమ్ చేంజర్‌ అప్‌డేట్‌ కూడా ఇవ్వలేను. కనుక మీరు నన్ను తిట్టుకోకుండా మరో 4-5 నెలలు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

ఈరోజు జరగండి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేసుకున్నాము. అయితే అది ఇప్పుడు అంత కిక్ ఇవ్వకపోవచ్చు. కానీ అదే పాటని థియేటర్లలో పెద్ద తెరపై చూసినప్పుడు, ఆడియన్స్ కుర్చీలలో కూర్చోలేరు. లేచి నిలబడి డ్యాన్సులు చేసే అంత గొప్పగా ఉంటుంది ఆ పాట. 

అదొక్కటే కాదు సినిమాలో ప్రతీ పాట, డ్యాన్స్ కూడా ఒక దానిని మించి మరొకటి అన్నట్లు ఉంటాయి. వాటిలో మూడు పాటలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. ఆ పాటలకు ఆడియన్స్ థియేటర్లలో డ్యాన్సులు చేయకుండా ఉండలేరు. కనుక గేమ్ చేంజర్‌ కోసం మరికొన్ని నెలలు ఓపిక పట్టక తప్పదు,” అని దిల్ రాజు అన్నారు. 


Related Post