విశ్వక్ సేన్ గామి ట్రైలర్‌… అద్భుతః!

March 01, 2024
img

విధ్యాధర కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్, చాందినీ చౌదరీ ప్రధాన పాత్రలలో ‘గామి’ సినిమా ట్రైలర్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో విడుదలైంది. నిజంగా అది అంత పెద్ద స్క్రీన్ చూడాల్సిన సినిమాయే. 223 సెకండ్స్ నిడివి గల గామి ట్రైలర్‌ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది. ముఖ్యంగా మంచు పర్వతాలలో తీసిన దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే విశ్వక్ సేన్ కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలిచిపోబోతుంది.    

గామి ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్నాడు. ‘గామి’లో విశ్వక్ సేన్, ఎమ్జీ అభినయ, మహమ్మద్ సమాద్, దయానంద్ రెడ్డి, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌ పెద్దాడ, రమ్యా పసుపులేటి, శాంతి రావు, మాయాంక్, జాన్ కూట్లే, బొమ్మ శ్రీధర్, రజినీష్ శర్మ, కెఆర్ ఉన్నికృష్ణ, వెంకట్ రామన్ రావు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విధ్యాధర్ కాగిత, ప్రత్యూష వట్యమ్, సంగీతం: నరేశ్ కుమారన్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రాఘవేంద్ర తిరుణ్, యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చౌన్ అంజి చేశారు. 

వి.సెల్యూలాయిడ్ సమర్పణలో యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాని నిర్మించారు. 


Related Post