కోలీవుడ్ నటుడు కార్తి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కార్తి, కృతి శెట్టి జంటగా నటించిన తమిళ సినిమా ‘వా వాతియార్’ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో సంక్రాంతికి విడుదల చేశారు. నెలరోజులు గడవక మునుపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 5 భాషల్లో ఒకేసారి ప్రసారం కాబోతోంది.
ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, జి.ఎం.సుందర్, రమేష్ తిలక్, పి.ఎల్. తెనప్పన్, విద్యా బోర్జియా, నివాస్ అధితాన్, మధుర్ మిట్టల్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కథ, దర్శకత్వం: నలన్ కుమారస్వామి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఆర్ట్ డైరెక్టర్: డి. ఆర్.కె.కిరణ్, ఎడిటింగ్: వెట్రే కృష్ణన్, యాక్షన్: ‘అనల్’ అరసు, నృత్య దర్శకత్వం: సాండీ, ఎం.షెరీఫ్ చేశారు.
ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజాసాబ్ నిర్మించారు.