తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ

January 27, 2026


img

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు జారీ అయ్యింది. రాష్ట్రంలో ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల పాలక మండళ్ళను ఎన్నుకోవడానికి ఫిభ్రవరి 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాణి కుముదిని ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించారు. 

ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది... 

జనవరి 28: నామినేషన్స్ స్వీకరణ ప్రారంభం 

 జనవరి 30:   నామినేషన్స్ దాఖలుకి గడువు. 

జనవరి 31: నామినేషన్స్ పరిశీలన

ఫిభ్రవరి 3: నామినేషన్స్ ఉపసంహరణ గడువు.

ఫిభ్రవరి 11: పోలింగ్. 

ఫిభ్రవరి 12: అవసరమైన చోట్ల రీపోలింగ్. 

ఫిభ్రవరి 13: ఓట్ల లెక్కింపు. 

ఫిభ్రవరి 16: మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ల ఎన్నిక.

ఫిభ్రవరి 16: కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.


Related Post