సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుపోయే మాస్ మహారాజ్ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశారు. మరి ఆయన అయ్యప్పదీక్ష చేసేందుకు సమయం ఎక్కడుటుంది? అంటే ఉందనే అంటున్నారు దర్శకుడు శివ నిర్వాణ.
నిన్న రవితేజ పుట్టినరోజు సందర్భంగా తమ సినిమాకు ‘ఇరుముడి’ అని పేరు ఖరారు చేశారు. అయ్యప్పదీక్ష దుస్తులలో నెత్తిపై ఇరుముడి మూట పెట్టుకొని ఓ పాపని ఎత్తుకొని ఉండగా చుట్టూ అయ్యప్పస్వాముల వాయిద్యాలు వాయిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నారు.