ఫామ్‌హౌసులో గూడచారి సంతోష్ రావు: కవిత

January 27, 2026


img

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దీనిపై తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “ఉద్యమకారుడైన కేసీఆర్‌ని ఉద్యమకారులకు, పేద ప్రజలకు, అమరవీరులకు, చివరికి గద్దర్, ఈటల రాజేందర్ వంటి వారికి దూరం అయ్యారంటే దానికి కారణం ఈ సంతోష్ రావనే దెయ్యమే. 

ఆయన ఫామ్‌హౌసులో సిఎం రేవంత్ రెడ్డి గూడచారిగా పనిచేస్తున్నాడు. ఫామ్‌హౌసులో కేసీఆర్‌ ఏం తింటున్నారో?ఎప్పుడు పంటారో? ఎప్పటికప్పుడు సిఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఇస్తుంటాడు ఈ సంతోష్ రావు. కనుక ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంతోష్ రావుకి ఏమీ కాకుండా సిఎం రేవంత్ రెడ్డే చూసుకుంటారు.

కానీపార్టీని, తన పరువు ప్రతిష్టలని సర్వనాశనం చేసిన ఇలాంటి దెయ్యాలు సంతోష్ రావు, హరీష్‌ రావు వంటివారినే కేసీఆర్‌గారు ఇంకా ఎందుకు నమ్ముతున్నారో? నాకు అర్థం కాదు. 

ఈ కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒత్తిళ్ళకు తలొగ్గకుండా సంతోష్ రావుని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 

(video courtesy: RTV)

Related Post