హైదరాబాద్, నాంపల్లి స్టేషన్ రోడ్డులో గల బచాస్ ఫర్నీచర్ షో రూములో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 5 మంది చనిపోయారు. సెల్లార్‌లో నివాసం ఉంటున్న వాచ్ మ్యాన్ దంపతుల ఇద్దరి పిల్లలు అఖిల్ (7), ప్రణీత్ (11), ముగ్గురు కార్మికులు బీబీ (55), సయ్యద్ హబీబ్ (40), మహ్మద్ ఇంతియాజ్ (27) చనిపోయారు. వారందరూ దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు.
పోలీసులు భవన యజమాని, ఫర్నీచర్ షో రూమ్ యజమానిపై కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. శుక్రవారం రాత్రే చైనా నుంచి రెండు కంటైనర్లలో భారీగా ఫర్నీచర్ వచ్చింది. కార్మికులు వాటిని సెల్లారులో భద్రపరిచారు.
అక్కడే మంటలు మొదలై పై అంతస్తులకు వ్యాపించాయి. అక్కడే మంటలు మొదలై పై అంతస్తులకు వ్యాపించాయి. వారిలో ముగ్గురూ, వాచ్ మ్యాన్ పిల్లలిద్దరూ లోపల చిక్కుకోగా మిగిలినవారు బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. లేకుంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.