ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ హైస్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గౌతమి రీల్స్ చేస్తున్నందుకు జిల్లా డీఈవో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకి ప్రమోషన్స్ చేస్తున్నందుకు , రీల్స్ చేస్తునందుకు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంత మంది ఆమెకు మద్దతు తెలుపుతుంటే, చాలా మంది తగిన శాస్తి జరిగిందంటూ విమర్శిస్తున్నారు.
నాలుగైదు రోజులుగా ఈ విమర్శలను తట్టుకోలేక నేను మానసికంగా చాలా క్రుంగిపోయానని, ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయడంతో కుమిలిపోతున్ననంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు
తన విద్యార్ధుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే తాను, ఇలా చేయడం తప్పని తెలియకనే చేశానని, మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని, అందరూ తనను క్షమించాలని బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకొని చేతులు జోడించి ఆమె ఆ వేడుకున్నారు.
ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే...