ఇదిగో దేవర-2 అప్‌డేట్‌!

January 27, 2026


img

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ హీరోగా దేవర మొదటి భాగం 2024లో విడుదలైంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే దేవర-2 ఉంటుందని కొరటాల శివ ప్రకటించారు. ఇటీవల ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ దేవర-2 పనులు ఈ ఏడాది మే నెల నుంచి మొదలుపెట్టి  2027లో విడుదల చేస్తామని తామని కొరటాల శివ చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు సంతోషపడటానికి ఈ ఒక్క మాట చాలు.  

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా, మలయాళ నటుడు టోవినో థామస్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. 

బాలీవుడ్‌ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్, టాలీవుడ్‌ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై గుల్షన్ కుమార్‌ సమర్పణలో భూషణ్ కుమార్‌, నవీన్ ఎర్నేని, రవిశంకర్, కళ్యాణ్ రామ్ కలిసి ‘డ్రాగన్’ పాన్‌ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా పూర్తిచేసిన తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పౌరాణిక సినిమా ‘మురుగన్’ మొదలుపెట్టాలి. కానీ మే నుంచి దేవర-2 మొదలుపెట్టడం ఖాయం అయితే త్రివిక్రమ్ సినిమా దాని తర్వాతే ఉండొచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష