డేవిడ్ రెడ్డిగా మంచు మనోజ్...

January 25, 2026


img

దాదాపు పదకొండేళ్ళు సినీ పరిశ్రమకి దూరంగా ఉన్న మంచు మనోజ్, గత ఏడాది భైరవం, మిరాయ్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మిరాయ్‌లో విలన్‌గా నటించినప్పటికీ మెప్పించారు. ఈ ఏడాది మొదటి నెలలోనే  కొత్త సినిమా ప్రారంభిస్తున్నారు. 

హనుమారెడ్డి యక్కంటి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తీయబోతున్న ఈ సినిమాకి ‘డేవిడ్ రెడ్డి’ అని పేరు ఖరారు చేశారు. ఇది పూర్తి యాక్షన్ మూవీ అని ఫస్ట్ గ్లిమ్స్‌తో చెప్పేశారు. కేజీఎఫ్ వంటి సూపర్ హిట్‌ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, కోరియోగ్రఫీ: సుప్రీం సుందర్ చేస్తున్నారు. 

వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష