సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం.. వేసవిలో ఆదర్శ కుటుంబం?

January 25, 2026


img

అనిల్ రావిపూడి-వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని చెప్పి మరీ గత ఏడాది సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు. ఈసారి పండగకి మన శంకర వరప్రసాద్ గారితో వస్తున్నామని చెప్పి వచ్చి హిట్ కొట్టారు. వచ్చే సంక్రాంతికి మళ్ళీ వెంకటేష్‌తో వాస్తానని అనిల్ రావిపూడి ముందే చెప్పారు. కనుక వచ్చేస్తున్నారు. 

కానీ మద్యలో వెంకీ-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ ఉందిగా? అనే సందేహం కలుగుతుంది. త్రివిక్రమ్‌తో సినిమా అంటే కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి. కానీ అనిల్ రావిపూడి ఆడుతూ పాడుతూ చకాచకా సినిమా పూర్తిచేసేస్తారు.

అనిల్ రావిపూడి చెప్పిన కధని వెంకీ ఒకే చేసేశారు. ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకొని, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునేలోగా ఆదర్శ కుటుంబం కొంత దూరం వెళుతుంది కదా? 

కనుక అంతవరకు ‘ఆదర్శ కుటుంబం’ చేసి జూన్ నుంచి అనిల్ రావిపూడితో సినిమా మొదలుపెట్టేయాలని వెంకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో షూటింగ్ మొదలుపెట్టినా అన్ని పనులు డిసెంబర్‌కల్లా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతికి అందించగలరు. 

ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చిలోగా ఆదర్శ కుటుంబం సిద్ధమైతే వేసవిలో విడుదల చేయాలని తాజా ప్లాన్ అని తెలుస్తోంది. 

అనిల్ రావిపూడి సినిమా అంటే త్వరలోనే రిలీజ్ డేట్, హీరోయిన్‌తో సహా ప్రకటన వచ్చేస్తుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించబోతున్నట్లు సమాచారం.


Related Post

సినిమా స‌మీక్ష