రవితేజ మరీ ఇంత స్పీడా...

January 25, 2026


img

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ, అది పూర్తికాక మునుపే శివ నిర్వాణ దర్శకత్వంలో ఆర్‌టి77 వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

రివెంజ్ డ్రామాగా సిద్ధం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు  ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ వేశారు. చీకటిలో ఊరి శివారులో రోడ్డు పక్కన ఓ తాడుపై ఆరేసిన బట్టలు, దానికి మరికాస్త దూరంలో ఓ నదిపై కనిపిస్తున్న ఓ రైల్వే బ్రిడ్జ్ ఫోటో వేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించబోతున్నారు. పూర్తి వివరాలు రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష