యువ నటుడు నితిన్ ఇదివరకు అనేక సూపర్ హిట్స్ కొట్టాడు. కానీ మళ్ళీ రేసులో వెనకబదిపోయారు. భారీ అంచనాలతో విడుదలైన ‘రాబిన్ హుడ్’ తీవ్ర నిరాశ పరచగా తర్వాత విడుదలైన ‘తమ్ముడు’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనుక నితిన్ కెరీర్ మళ్ళీ గాడిలో పడటానికి ఒక మంచి హిట్ చాలా అవసరం. విలక్షణమైన కాన్సెప్ట్, కధతో ప్రేక్షకులను మెప్పించే దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ సినిమా మొదలుపెట్టారు. ఈ విషయం తెలియజేస్తూ ‘నో బడీ... నో రూల్స్’ అనే క్యాప్షన్ నేడు సోషల్ మీడియాలో ఓ చక్కటి పోస్టర్ పెట్టారు. పవన కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.