అవును ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరోగా నటించబోతున్నారు. కొత్త దర్శకుడు నూతన్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా పేరు షో మ్యాన్. ట్యాగ్ లైన్ మ్యాడ్ మాన్‌స్టర్. సినిమా టైటిల్ మాత్రమే కాదు... కధ కూడా వర్మ అభిరుచికి తగినట్లుగానే గ్యాంగ్ వార్స్, తుపాకులు, రక్తపాతంతో నిండి ఉంటుంది.
భీమవరం టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం 120వ సినిమాగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఓ ప్రముఖ కార్పోరేట్ కంపెనీతో కలిసి ఈ సినిమా నిర్మించబోతునారు.
ఈ సినిమాల్ సీనియర్ నటుడు సుమన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే నెల సంక్రాంతికి షో మ్యాన్ ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత రామ సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.