జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’కి సంబంధించి మరో అప్‌డేట్ వినిపిస్తోంది. ‘కాంతార’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఓ అతిధి పాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే ఆయన కూడా సెట్స్‌లో అడుగుపెట్టబోతునట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ కోసం త్వరలోనే జూ.ఎన్టీఆర్‌తో సహా చిత్ర బృందం అమెరికాకు బయలుదేరబోతోంది. జూ.ఎన్టీఆర్ హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్ళి కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో భేటీ అయ్యారు. ఆమె సాదరంగా జూ.ఎన్టీఆర్‌ని ఆహ్వానించి, అమెరికాలో సినిమా షూటింగ్ చేసుకోబోతునందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారత్-అమెరికా మద్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అమెరికా, మెక్సికో, ఇటలీ దేశాలలో ఉన్నటువంటి మాఫియా ప్రపంచాన్ని ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అమెరికాలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026, జూన్ 25న విడుదల కాబోతోంది.