ఈజీ మనీ కోసమే స్కూల్లో మాదకద్రవ్యాల తయారీ!

September 14, 2025
img

హైదరాబాద్‌ ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూలులో మత్తు పదార్ధాలు తయారుచేస్తునట్లు పసిగట్టిన ఈగల్ టీమ్‌ మొన్న హటాత్తుగా దాడి చేసి స్కూలు ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్‌ (39), అతనికి సహకరిస్తున్న ఉదయ్ సాయి (23), గౌటె మురళి(23)లను అరెస్ట్‌ చేశారు.

వారు తెలిపిన సమాచారం ప్రకారం మహబూబ్ నగర్‌కు చెందిన మలేల జయప్రకాష్ మహేష్ కుమార్ గౌడ్‌ ఓల్డ్ బోయినపల్లి, సాయి కాలనీలో నివాసం ఉంటూ సమీపంలోనే మేధా హైస్కూల్ నిర్వహిస్తున్నాడు.

కానీ స్కూలుపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు అల్ఫ్రాజోలం అనే మత్తు మందు తయారుచేయడం మొదలుపెట్టాడు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి అల్ఫ్రాజోలం తయారుచేసే ఫార్ములా, దానికి అవసరమైన ముడి సరుకులు, పరికరాల గురించి జయప్రకాష్ గౌడ్‌ తెలుసుకున్నాడు.

స్కూలు రెండో అంతస్తులో రెండు గదులను పూర్తిగా దీని కోసమే కేటాయించాడు. అక్కడ తయారుచేసిన అల్ఫ్రాజోలంని మహబూబ్ నగర్‌లోని భూత్పూరు మండలంలొనిఒ కల్లు దుకాణాలకు సరఫరా చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు.

ఈగల్ టీమ్‌ సుమారు 7 కేజీల అల్ఫ్రాజోలం, దాని ని తయారుచేసేందుకు ఉపయోగిస్తున్న పరికరాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసింది.

పాఠాశాల విద్యాశాఖ అధికారులకు ఈ సమాచారం ఇవ్వడంతో వారు మేధా హైస్కూలు అనుమతి రద్దు చేసి, విద్యార్ధులను సమీపంలోని ఇతర పాఠాశాలలో చేర్పిస్తున్నారు. 

Related Post