బ్యూటీ ట్రైలర్‌... బ్యూటిఫుల్

September 14, 2025


img

జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నిలాఖి పాత్ర జంటగా నటించిన ‘బ్యూటీ’ సినిమా టీజర్ వెనకే ట్రైలర్‌ కూడా వచ్చేసింది. ఓ అందమైన మధ్యతరగతి కుటుంబం... ప్రేమలు, అనురాగాలు, చిలిపి గొడవలు... అక్కడి నుంచి ఆ ఇంట్లో అమ్మాయి హీరోతో ప్రేమలో పడటం వరకు రోటీన్‌ కధలాగే అనిపిస్తుంది. 

కానీ ఆ తర్వాత కధ పరుగులు పెడుతుందని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. క్యాబ్ డ్రైవరుగా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి ప్రేమని, ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోకుండా పుట్టినరోజు బహుమతిగా స్కూటీ కొనివ్వలేదని కూతురు ఆవేశపడటం, ఆ తర్వాత హీరోతో పారిపోవడం, పోలీసులు ఎంట్రీతో దర్శకుడు సినిమాలో కొత్తగా ఏదో చెప్పబోతున్నాడనిపిస్తుంది. అవునో కాదో తెలియాలంటే సెప్టెంబర్‌ 19న సినిమా విడుదలైనప్పుడు చూసి తెలుసుకోవలసిందే.

ఈ సినిమాలో నరేష్, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహార, నితిన్  ప్రసన్న, మురళి గౌడ్‌, నంద గోపాల్, నాగేంద్ర మేడిద తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్‌ ప్లే: ఆర్‌ వీ సుబ్రహ్మణ్యం; డైలాగ్స్, దర్శకత్వం: జేఎస్ఎస్ వర్ధన్; సంగీతం: విజయ్ బుల్గానిన్; కెమెరా: శ్రీ సాయికుమార్ దార; ఎడిటింగ్: ఎస్‌బిఉ ఉద్ధవ్; ఆర్ట్: బేబీ సురేష్ భిమగన్ చేశారు. 

వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఏ విజయ్ దేవరకొండ కుమార్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 19న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష