మిరాయ్ సీక్వెల్‌ తప్పకుండా... తేజా సజ్జా

September 14, 2025


img

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా, మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలు చేసిన ‘మిరాయ్’ తొలి రోజునే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు కలెక్షన్స్ కనకవర్షం కురిపిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.60 కోట్లు కలక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. 

ఈ సందర్భంగా తేజా సజ్జా ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పారు. నిజానికి ఈ సినిమాని వెబ్‌ సిరీస్‌లా తీసి ఉంటే కధ ఇంకా బాగా వచ్చేది. ఈ సినిమా కనీసం 4 గంటలు నిడివి ఉన్నా కధకు పూర్తి న్యాయం జరిగేది. కానీ కధ క్రిస్పీగా ఉండాలని నిర్ధాక్షిణ్యంగా చాలా సన్నివేశాలు కత్తిరించేశాము. 

సినిమాలో రెండు పాటలు తీసేశాము. వాటిలో వైబ్ సాంగ్ కూడా ఒకటి. ఎంతో కష్టపడి చిత్రీకరించిన తర్వాత ఇలా కత్తిరించి తీసిపడేయడం బాధ కలిగించింది. కానీ తప్పలేదు. మేము ఎంత మొహమాటపెడుతున్నా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మాకే నచ్చజెప్పుతూ నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పడేశారు. కానీ ఆయన నిర్ణయమే సరైనదని సినిమా రిజల్ట్ చూశాక అందరూ అంగీకరించాము. 

ఇక మా సినిమాలో మన చరిత్రని, పురాణ ఇతిహాసాలలో అంశాలను తీసుకొని జోడించి తీయడం కూడా చాలా మంఛి ఐడియా అని నిరూపితమైంది. 

అశోకుడు చరిత్రని బేస్ చేసుకొని పురాణ పురుషులను కధలో చాలా చక్కగా కలిపామని చాలా మంది అభినందిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం మా కధలో రాముడు, శ్రీకృష్ణుడుని ఇరికించాలనుకోలేదు. ఆవిధంగా కధ వ్రాసుకొని ఈ ఎఫెక్ట్ తెచ్చాము అంతే!

ఇక సినిమా బడ్జెట్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ఖర్చులు తగ్గించుకోవడానికి ఏమేమి చేయాలో అన్నీ చేశాము. అవుట్ డోర్‌ లోకేషన్లలో కారవాన్ లేకుండానే షూటింగ్‌ చేశాము. నా ఉద్దేశ్యంలో మిరాయ్ చాలా పెద్ద కధ. కనుక తప్పకుండా దీనికి సీక్వెల్‌ తీస్తాము,” అని తేజా సజ్జా చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష