సుజీత్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఓజీ’ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా భారీ అంచనాల మద్య ఈ నెల 25న ఓజీ విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇటీవలే ట్రాన్స్ ఆఫ్ ఓఎంఐ విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు ఈ సినిమా నుంచి ‘గన్స్ అండ్ రోసస్’ అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్ విడుదల కాబోతోంది. దర్శకుడు సుజీత్ ఈ మేరకు సోషల్ మీడియాలో దీని ప్రమో బిట్ పెట్టారు.
ఓజీలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.
The next vibe. 🔫🌹
— Sujeeth (@Sujeethsign) September 14, 2025
September 15th. #OG#GunsNRoses #TheyCallHimOG pic.twitter.com/c64fyt6anp