ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వృషభ’ తెలుగుతో సహా 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది. ఈ నెల 18న వృషభ టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ పెట్టింది చిత్ర నిర్మాణ సంస్థ.
ఈ సినిమాలో మోహన్ లాల్, శనయా కపూర్, జహ్రా ఎస్. ఖాన్, రామచంద్ర రాజు, రాగిణి ద్వివేది, మేకా శ్రీకాంత్, నేహా సక్సేనా, రోషన్ మేకా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నంద కిశోర్; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: ఆంటోనీ శాంసన్; ఎడిటింగ్: కె. ఎం. ప్రకాష్ చేస్తున్నారు.
బాలాజీ మోషన్ పిక్చర్స్, కనెక్ట్ మీడియా, ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏకతా కపూర్, సీ.కె. పద్మ కుమార్, వరుణ్ మాథ్యూర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గూర్నాని, జూహి పారేఖ్ వృషభ నిర్మిస్తున్నారు.