ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు బ్యూటీ

September 16, 2025


img

జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో అంకిత్ కొయ్య, నిలాఖి పాత్ర జంటగా నటించిన ‘బ్యూటీ’ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నేడు రిలీజ్ పోస్టర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాలో నరేష్, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహార, నితిన్  ప్రసన్న, మురళి గౌడ్‌, నంద గోపాల్, నాగేంద్ర మేడిద తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్‌ ప్లే: ఆర్‌ వీ సుబ్రహ్మణ్యం; డైలాగ్స్, దర్శకత్వం: జేఎస్ఎస్ వర్ధన్; సంగీతం: విజయ్ బుల్గానిన్; కెమెరా: శ్రీ సాయికుమార్ దార; ఎడిటింగ్: ఎస్‌బిఉ ఉద్ధవ్; ఆర్ట్: బేబీ సురేష్ భిమగన్ చేశారు. 

వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఏ విజయ్ కుమార్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 19న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష