బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్!

September 16, 2025
img

ఈ నెల 21 నుంచి బతుకమ్మ పండగ మొదలవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరిట ఔత్సాహిక రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులు, నటీనటుల నుంచి పాటలు, షార్ట్ ఫిలిమ్స్ పోటీ నిర్వహిస్తోంది. 

ఈ పోటీలలో ప్రధమ బహుమతి రూ.3 లక్షలు, రెండో బహుమతి రూ. 2 లక్షలు, మూడో బహుమతి లక్ష రూపాయలు,  కన్సొలేషన్ బహుమతిగా ఒక్కొక్కరికీ రూ.20,000 చొప్పున ఐదుగురికి ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. 

అర్హతలు: వయసు 40లోపుగా ఉండాలి. షార్ట్ ఫిలిమ్స్ లేదా వీడియో సాంగ్స్ 4కే రిజల్యూషన్‌లో తీయాలి. పాటలు, షార్ట్ ఫిలిమ్స్ ఏవైనా సరే... ప్రభుత్వం సూచించిన ఈ దిగువ అంశాలకు సంబంధించినపై మాత్రమే ఉండాలి. పోటీకి పంపుతున్నవాటిని గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండరాదు. ఈ పోటీల కోసమే తీసినట్లు హామీ పత్రం జత చేయాలి. 

ప్రభుత్వం సూచించిన అంశాలు:  

క్యాటగిరీ 1: తెలంగాణలో ప్రజా పాలన; తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు. 

క్యాటగిరీ 2: షార్ట్ ఫిలిమ్స్ (3 నిమిషాల నిడివి); పాటలు: (5 నిమిషాల నిడివి). 

గడువు: సెప్టెంబర్‌ 30, 2025

ఆన్‌లైన్‌లో పంపించాల్సిన చిరునామా: youngfilmmakerschallenge@gmail.com  

వాట్సప్ నంబర్: 81258 34009.                

Related Post