గర్ల్ ఫ్రెండ్ ఇంకా షూటింగ్ జరుగుతోందట!

July 05, 2025

img

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేస్తున్న‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌ ఎప్పుడో వచ్చేసింది. కనుక నేడో రేపో సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తూనే, ఇంకా షూటింగ్ జరుగుతోందని, ఓ పాట చిత్రీకరించామని గీతా ఆర్ట్స్ చల్లగా చెప్పింది. త్వరలోనే మొదటి పాట విడుదల చేస్తామని, అప్పుడే రిలీజ్‌ డేట్ కూడా ప్రకటిస్తామని తెలియజేసింది. ఎప్పుడో మొదలుపెట్టిన గర్ల్ ఫ్రెండ్ ఇంకా పూర్తవలేదు కానీ ఇటీవలే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ అనే హీరోయిన్‌ ఓరియంటడ్‌ మూవీ మొదలుపెట్టింది.

గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

Romance, Rhythm, and Raw Emotion 🎼#TheGirlfriend shoot in full swing with a peppy and soulful song called #Nadhive being picturized on @iamRashmika & @Dheekshiths ❤‍🔥#TheGirlfriend Release Date Announcement & First Single Coming Soon ✨@HeshamAWMusic's soulful music will… pic.twitter.com/AgeLF0sOJk
— Geetha Arts (@GeethaArts) July 5, 2025

Related Post

సినిమా స‌మీక్ష