సామాజిక కధాంశంతో ‘కుబేర’ వంటి చక్కటి సినిమా తీసి హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల, ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయి దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు కూడా. కనుక ఇప్పుడు కుబేర తర్వాత ఎటువంటి సినిమా తీయబోతున్నారు?అనే మీడియా ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
ఇటువంటి ఓ సామాజిక సమస్యపై దర్శకుడుగా ఆవేశంతో సినిమా తీసిన తర్వాత మళ్ళీ అటువంటి సినిమా తీయాలంటే ముందుగా ఆ ప్రభావం నుంచి బయటపడటం చాలా అవసరం. కనుక నేను నా ఆనవాయితీ ప్రకారం ఓ చక్కటి ప్రేమ కధతో సినిమా చేస్తాను.
అయితే ప్రేమ కధే కదా అని లైట్ తీసుకోకుండా దానినీ అంతే శ్రద్దగా తీస్తాను. ఎన్ని సినిమాలు చేశాననే దాని కంటే ఎన్ని మంచి సినిమాలు చేశాననేదే నాకు ముఖ్యం. అందుకే ప్రతీ సినిమాకి చాలా టైమ్ తీసుకుంటాను. కనుక నా తదుపరి సినిమాకి కాస్త టైమ్ పడుతుంది. కానీ అందుకు తగిన ప్రతిఫలం తప్పక ఉంటుంది.
లవ్ స్టోరీతో తీసే సినిమాలకు కేఎం రాధాకృష్ణ తన సంగీతంతో ప్రాణం పోస్తారు. ఆనంద్, గోదావరి సినిమాలకు ఆయన అందించిన సంగీతం ఎంత గొప్పగా ఉందో అందరూ చూశారు. కనుక ఆయనే నా కొత్త సినిమాకి సంగీత దర్శకుడు,” అని శేఖర్ కమ్ముల చెప్పారు.