తెలుగులో యమ ధర్మరాజు ప్రధాన పాత్రలో అనేక సినిమాలు వచ్చాయి. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ‘యముడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
జగదీష్ ఆమంచి నటించి స్వీయ దర్శకత్వంలో తీస్తున్న ‘యముడు’ సినిమా సబ్ టైటిల్ ధర్మో రక్షతి రక్షితః. ఈ సినిమా నుంచి ధర్మో రక్షతి రక్షితః అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. వంశీ, సరోజినీ, వికాస్ కలిసి వ్రాసిన ఈ పాటకి భవానీ రాకేష్ సంగీతం అందించగా అరుణ్ కౌండిన్య, హర్షవర్ధన్ చావలి, సాయి చరణ్ భాస్కరుని కలిసి పాడారు.
ఈ సినిమాలో జగదీష్ ఆమంచి ‘యముడు’ పాత్రలో నటిస్తుండగా, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ: హరి అల్లసాని, జగదీష్ ఆమంచి, స్క్రీన్ ప్లే: శివ కుండ్రపు, సంగీతం: భవానీ రాకేష్, కెమెరా: విష్ణురెడ్డి వంగా, ఎడిటింగ్: కేసీబీ హరి.
జగన్నాధ్ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి స్వయంగా ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సినిమా రిలీజ్ కాబోతోంది.