శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలు చేసిన కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరుగవలసి ఉండగా అహ్మదాబాద్ విషాద ఘటన దృష్ట్యా రద్దు చేశారు. ఈ నెల 15 (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్, జెఆర్‌సీ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌నిర్వహిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.
ఈ సినిమాలో జిమ్ సరబ్, సాయాజీ ఏక్‌నాధ్ షిండే ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేశారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ‘కుబేరా’ జూన్ 20న విడుదలవుతోంది.