మెగాస్టార్ చిరంజీవికి రెండో హీరోయిన్‌ కన్ఫర్మ్

May 18, 2025


img

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాలో హీరోయిన్‌గా నయనతారని పరిచయం చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి రెండు రోజుల క్రితమే ఓ కాన్సెప్ట్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు రెండో హీరోయిన్‌ పేరు కూడా ఖరారు చేశారు.

రెండో హీరోయిన్‌గా క్యాథరిన్‌ని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమాలోహర్షవర్ధన్, అభినవ్ గోమటంల, సచిన్ కేడ్కర్‌లను కూడా తీసుకున్నారు. త్వరలోనే ఈ విషయం అధికారికంగా ప్రకటించనున్నారు.     

ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్‌’గా నటించబోతున్నారు. విక్టరీ వెంకటేష్‌ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి మరోసారి కన్ఫర్మ్ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష