మహావతార్ నరసింహ ప్రమో చూడాల్సిందే!

May 11, 2025


img

సినీ నిర్మాణ రంగంలో కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ హోంబలే ఫిల్మ్స్‌ నుంచి ఓ సినిమా వస్తోందంటే అది తప్పకుండా గొప్ప సినిమా, తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అందరూ భావించే స్థాయికి ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

కేజీఎఫ్, సలార్ రెండు సినిమాలు చాలు దాని సత్తా చాటడానికి. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ సినిమా తీస్తోంది. శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహావతారంలో హిరణ్య కశిపుడనే రాక్షస రాజుని హత్యమార్చిన కధతో ఈ సినిమాని తీశారు. 

నరసింహ జయంతి సందర్భంగా ఈరోజు విడుదల చేసిన సినిమా ప్రమో మహాద్భుతంగా ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ నరసింహావతారం గురించి తెలుసు కనుక దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

అశ్విన్ కుమార్‌ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ ప్రశాంత్ వర్మ, అశ్విన్ కుమార్‌, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేస్తున్నారు. 

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు: ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా. ఈ ఏడాది జూలై 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.       


Related Post

సినిమా స‌మీక్ష