మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మంచి నటుడు, రచయిత, దర్శకుడు కూడా. 2019లో విడుదలైన ఫలక్‌నూమా దాస్ సినిమాకు విశ్వక్ సేన్ కధ, దర్శకత్వం, సహ నిర్మాత కూడా. మళ్ళీ 2023లో విడుదలైన ‘దాస్ కా దమ్కీ’ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం చేశారు. ఇప్పుడు #కల్ట్ అనే మరో సినిమాకు కధ, దర్శకత్వం చేస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమా గురించి విశ్వక్ సేన్ ఏమన్నారంటే, దీనిలో నేను నటించడం లేదు. చాలా మంది కొత్త నటీనటులు నటిస్తారు. ఇటీవల వియత్నాంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా నేను ఈ కధ తయారుచేశాను. ఇలాంటి పాయింట్‌తో ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు. కనుక ఇది ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా తీస్తాము,” అని చెప్పారు.
ఈ సినిమాకు కధ విశ్వక్ సేన్, డైలాగ్స్: తరుణ్ భాస్కర్, సంగీతం: రవి బస్రూర్, ఆర్ట్: అరవింద్ మూలే, చేస్తారు. తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై #కల్ట్ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
Visuals from #Cult movie Pooja Ceremony pic.twitter.com/PnOJCu7DpK