విడి 14 నుంచి మరో పోస్టర్

May 09, 2025


img

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఓ చక్కటి పోస్టర్ విడుదల చేశారు. ఓ మఠంలో భైరవస్వామి విగ్రహం ఎదుట విజయ్ దేవరకొండ నేలపై కూర్చొని జపం చేస్తున్నట్లు చూపారు. పోస్టర్లో విజయ్ దేవరకొండని వెనుక వైపు నుంచి చూపినప్పటికీ కండలు తిరిగిన చేతులు, సిక్స్ పాక్‌ శరీరంతో చూడముచ్చటగా ఉన్నారు.    

ఇది విజయ్ దేవరకొండకు 14వ సినిమా. దీనిని ప్రకటించినప్పుడు, “వీరగాధలు లిఖించబడవు... అవి వీరుల రక్తం నుంచే ఆవిర్భవిస్తాయి. ఓ శాపగ్రస్తమైన సామ్రాజ్యానికి చెందిన ఓ వీరుడిని పరిచయం చేస్తున్నాము..,” అంటూ 18వ శతాబ్ధంలో జరిగిన ఓ చారిత్రిక నేపధ్యం కలిగిన కధతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ సూచించారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక మందన నటించబోతున్నట్లు సమాచారం. జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష