దర్శకుడు పూరీ జగన్నాధ్ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నామని పూరీ స్వయంగా చెప్పారు. ఈ సినిమాలో ‘టబు’ని తీసుకోగా, ఇప్పుడు రాధిక ఆప్టేని తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాకి ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో బిచ్చగాడి వేషం చేతిలో బొచ్చె పట్టుకొని ఉన్న విజయ్ సేతుపతి పోస్టర్ ఒకటి వచ్చింది. కానీ రాధికా ఆప్టే, సినిమా పేరు, పోస్టర్ గురించి పూరీ టీమ్ ధృవీకరించలేదు. త్వరలోనే సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని పూరీ చెప్పారు కనుక అప్పుడే వీటి గురించి స్పష్టత వస్తుంది.
ఈ సినిమాని పూరీ, ఛార్మీల సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో 5 భాషలలొ పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు.