రివ్యూలతో ప్రేక్షకులను అడ్డుకోవద్దు ప్లీజ్: నాని

April 22, 2025


img

శైలేష్ కొలను దర్శకత్వంలో అర్జున్ సర్కార్‌గా నాని నటించిన సినిమా హిట్-3 సినిమా వచ్చే నెల 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నాని తాజా ఇంటర్వ్యూలో సినిమాలపై రివ్యూల ప్రభావం గురించి మాట్లాడుతూ, “రివ్యూలను ఎలాగూ ఆపలేము. రివ్యూలు నిషేధించాలని డిమాండ్ చేయను. కానీ ప్రేక్షకులు సినిమా చూసి బాగుందో లేదో నిర్ణయించుకునే అవకాశం వారికి ఇవ్వాలి కదా?అలా కాకుండా ఫస్ట్ షో పడగానే సినిమా బాగోలేదు.. ఫ్లాప్ అయ్యిందంటూ రివ్యూలు వ్రాస్తూ మన అభిప్రాయాన్ని ప్రేక్షకులపై రుద్దడం సబబేనా?అనేది నా ప్రశ్న. 

నిజమైన సినీ ప్రేమికులు తప్ప ఇప్పుడు చాలా మంది రివ్యూలు చూసిన తర్వాతే థియేటర్లకు వస్తున్నారు. సినిమా బాగోలేదని రివ్యూ వ్రాస్తే థియేటర్లకు రావడం మానేస్తున్నారు. కనుక ముందు ఓ వారం పది రోజులు థియేటర్లలో సినిమా ఆడిన తర్వాత, అప్పుడు, ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా తెలుసుకొని సినిమా రివ్యూలు వ్రాస్తే బాగుంటుంది. 

ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా రివ్యూలు అడ్డుకుంటుంటే నిర్మాతలతో పాటు మొత్తం సినీ ఇండస్ట్రీ నష్టపోతుంది కదా?కనుక రివ్యూలు వ్రాసేవారు కాస్త సంయమనం పాటించాలి. ఒకవేళ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే చూసి బాగోలేదనిపిస్తే ఆ రివ్యూ తమ సొంత అభిప్రాయమన్నట్లు చెప్పాలి తప్ప ప్రేక్షకులు అందరూ ఇలాగే అనుకుంటున్నారన్నట్లు వ్రాయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని నాని అన్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష