మహేష్ బాబు కుటుంబంతో కలిసి ఇటలీకి వెళ్ళగా, రాజమౌళి తన ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం తన టీమ్‌తో కలిసి జపాన్ వెళ్ళారు. ఇద్దరు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. కనుక త్వరలో వారి ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెట్టిన సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం కాబోతోంది.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలోని సిమిలిగూడ పరిసర ప్రాంతాలలో ఘాట్ చేశారు. రెండో షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న షెడ్యూల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు చేయబోతున్నారు.