శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ సిరీస్‌లో భాగంగా హిట్-ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ పేరుతో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా నాచురల్ స్టార్ నాని హీరోగా ‘హిట్: ది ధర్డ్ కేస్’ సిద్దం చేస్తున్నారు.
ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కాబోతోంది. అంటే మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉందన్న మాట. కనుక ‘హిట్: ది ధర్డ్ కేస్’ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో కరకు పోలీస్ ఆఫీసరుగా నాని నట విశ్వరూపం చూపారు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది.
‘హిట్: ది ధర్డ్ కేస్’కి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.
‘హిట్: ది ధర్డ్ కేస్’ని నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంత్ త్రిపిర్నేని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా తెలుగు హీరోల జాబితాలో నాని కూడా చేరిపోతారు. ట్రైలర్ చూస్తే సూపర్ డూపర్ హిట్ కాబోతోందనిపిస్తుంది.