రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా ‘పాంచ్ మినార్’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ కడుముల దర్శకత్వంలో కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై గోవిందా రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇవాళ్ళ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వచ్చే కష్టాలు రియల్ లైఫ్‌లో చాలా భయానకంగా మారుతాయి. కానీ ఇది సినిమా కనుక కామెడీగా అనిపిస్తుంది. రెండు నిమిషాల టీజర్‌లో చక్కటి కామెడీ, సరదాగా సరదాగా యాక్షన్ సీన్స్ చూసి హాయిగా నవ్వుకోవచ్చు. ఇదేవిధంగా సినిమా మొత్తం ఉంటే సూపర్ హిట్ అవడం ఖాయమే.
ఈ సినిమాలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, రవివర్మ, నితిన్ ప్రసన్న, సుదర్శన్, కృష్ణయతేజ, నండ గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం శేఖర్ చంద్ర, కెమెరా: ఆదిత్య జవ్వాది, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కొరియోగ్రఫీ: విజయ్ దేవరకొండ బిన్నీ, శ్రవణ్, కృష్ణ, స్టంట్స్: రాబిన్ సుబ్బు, ఆర్ట్: సురేష్ భీమగాని చేస్తున్నారు.