సినీ పరిశ్రమలోకి రవితేజ కుమార్తె

April 10, 2025


img

మాస్ మహరాజ్ రవితేజ జయాపజయాలను పట్టించుకోకుండా వరసపెట్టి సినిమాలు చేసుకుపోతూనే ఉంటారు. ఇప్పుడు ఆయన కుమార్తె మోక్షద కూడా సినీ పరిశ్రమలో ప్రవేశించబోతోంది. కానీ హీరోయిన్‌గా కాదు సినీ నిర్మాతగా అని తెలుస్తోంది. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఆనంద్ దేవరకొండ హీరోగా ఆమె ఓ సినిమా నిర్మించబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాకు వినోద్ ఆనంతోజు దర్శకత్వం చేయబోతున్నారు. రవితేజ కుమార్తె మోక్షద హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందనుకుంటే నిర్మాతగా వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సినీ పరిశ్రమలో హీరోలందరూ తాము ఎప్పటికీ హీరోలుగానే నటించాలని, తమ కుమారులు హీరోలు కావాలని కోరుకుంటారు. వారిని హీరోలుగా చేసేందుకు యధాశక్తిన తోడ్పడుతుంటారు. కానీ తమ కుమార్తెలు లేదా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం హీరోయిన్లుగా వద్దనుకుంటారు. కాస్టింగ్ కౌచ్, అందాల ప్రదర్శన, లిప్ లాక్ సీన్లు వగైరాలే కారణాలని అందరికీ తెలుసు. బహుశః అందుకే మోక్షద కూడా సినీ నిర్మాణంలో ప్రవేశిస్తున్నట్లు భావించవచ్చు. 

రవితేజ కుమారుడు మహాధన్ తండ్రితో కలిసి రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. బహుశః రాబోయే రోజుల్లో హీరోగా వస్తాడేమో? 


Related Post

సినిమా స‌మీక్ష