ఈ ఏడాది ప్రభాస్‌ పెళ్ళి ఖాయం?

March 27, 2025


img

తెలుగు సినీ హీరోలలో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్‌ పెళ్ళి గురించి తరచూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ప్రభాస్‌ కోసం ఓ అమ్మాయిని ఫైనల్ చేసిన్నట్లు తాజా సమాచారం. ఆమె తల్లి తండ్రులు ఏపీలో గణపవరం నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. పెళ్ళి కూతురు తండ్రి పెద్ద వ్యాపారవేత్త అని సమాచారం. 

ఇటీవల ఓ బంధువుల ఇంట్లో పెళ్ళిలో ప్రభాస్‌ ముగ్గురు చెల్లెళ్ళు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి పెద్దమ్మ శ్యామలాదేవితో కలిసి ఫోటో దిగారు. అప్పుడే ప్రభాస్‌ పెళ్ళి గురించి వారు చిన్న క్లూ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే ప్రభాస్‌ మరో రెండు మూడేళ్ళలో వరుసగా ఆరు సినిమాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. కనుక అంతవరకు ఆగితే ప్రభాస్‌ వయసు, పెళ్ళి కూతురు వయసు మరో మూడేళ్ళు పెరుగుతుంది. కనుక మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజాసాబ్’ షూటింగ్ పూర్తి చేయగానే ప్రభాస్‌ పెళ్ళి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందువల్ల అంటే మరో సినిమా మొదలుపెడితే మద్యలో పెళ్ళి కోసం సినిమా షూటింగ్‌ పక్కన పెట్టలేరు కనుక. 


Related Post

సినిమా స‌మీక్ష