గోపీచంద్ ఇప్పటి వరకు 32 సినిమాలలో నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు. కానీ సరైన కధలు ఎంచుకోలేకపోతుండటంతో చాలా కాలంగా సరైన హిట్ పడక ఇండస్ట్రీలో బాగా వెనుకపడిపోయారు.
'ఘాజీ' వంటి చక్కటి చిత్రంతో అందరినీ మెప్పించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ తన 33 వ సినిమా మొదలుపెట్టారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది.
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ హీరోయిన్ రితికా నాయక్ ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా నటించబోతోంది. ఆమె కూడా అశోకవనంతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ సరైన అవకాశాలు లభించలేదు.
వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న కొరియన్ కనకరాజు సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అది చేస్తుండగానే గోపీచంద్ సినిమాలో కూడా అవకాశం లభించింది.
ఈ సినిమా 7వ శతాబ్ధంనాటి చారిత్రిక నేపధ్యం ఉన్న సినిమా అని సమాచారం. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.