లైలా కోసం వస్తున్న చిరంజీవి!

February 09, 2025


img

విశ్వక్‌ సేన్‌ తొలిసారిగా అందమైన ఆడపిల్లగా నటిస్తున్న చిత్రం ‘లైలా’ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.

సంధ్య థియేటర్‌ ఘటన, తదనంతర పరిణామాల దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించబోతున్నారో దర్శక నిర్మాతలు ప్రకటించడం మానుకున్నట్లుంది. ఇవాళ్ళ సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఫంక్షన్ జరుగుతుందని సోషల్ మీడియాలో తెలిపారు కానీ హైదరాబాద్‌లో ఎక్కడో తెలియజేయలేదు.

బహుశః పరిమిత సంఖ్యలో ఎంపిక చేసినవారిని, మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారేమో. లైలా ట్రైలర్‌ లాంచింగ్ ఫంక్షన్ మొన్న అమీర్ పేట వద్ద గల ఏఏఏ సినిమాస్‌లో నిర్వహించారు కనుక ఇది కూడా అక్కడే నిర్వహిస్తారేమో? 

ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడుతూ, “హీరోలు లేడీ గెటప్ వేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కమల్ హాసన్ ‘భామనే సత్యభామనే,’ ‘మేడం’, తాజాగా అల్లు అర్జున్‌ పుష్ప-2 వంటివి ఇందుకు ఉదాహరణ. కనుక విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్ వేసిన మా ఈ లైలా సినిమా కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాము.

ఈ సినిమా ఫస్టాఫ్‌లో విశ్వక్‌ సేన్‌ సోనూగా కనిపిస్తారు. రెండో భాగంలో ‘లైలా’గా మారుతాడు. ఆ పాత్రలో విశ్వక్‌ సేన్‌ అద్భుతంగా నటించారు. ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భావిస్తున్నాము,” అని అన్నారు. 

రామ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌కి జోడీగా ఆకాంక్ష శర్మ నటించగా కామాక్షి భాస్కర్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్, ఆర్ట్: భామ కడలి చేశారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి లైలా సినిమా నిర్మించారు. 

          



Related Post

సినిమా స‌మీక్ష