గేమ్ చేంజర్‌ టికెట్స్ పెంపు అన్ ప్రెడిక్టబుల్: బిఆర్ఎస్

January 09, 2025


img

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో గేమ్ చేంజర్‌ నుంచి ఈరోజు ‘అన్ ప్రెడిక్టబుల్’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ఈ సినిమా నిర్మాత దిల్‌రాజు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి గేమ్ చేంజర్‌ టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించాలని అభ్యర్ధించారు. సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

దాని ప్రకారం మొదటి రోజు (శుక్రవారం) మాత్రం 6 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. మొదటి రోజున మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 చొప్పున అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి లభించింది. శనివారం నుంచి రోజుకి 19 వ తేదీ వరకు రోజుకి 5 షోలు వేసుకోవడానికి, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 చొప్పున అదనంగా వసూలు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. 

రేవంత్ రెడ్డి నిర్ణయం నిజంగానే ‘అన్ ప్రెడిక్టబుల్’ (ఊహించలేనిది) అని బిఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ స్పందిస్తూ, “ఆరోజు శాసనసభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది.

గేమ్ చేంజర్‌కు మినహాయింపు ఇవ్వడానికి కారణం ఏమిటి? తెలంగాణ సంస్కృతి పట్ల చులకన భావం ప్రదర్శించే దిల్‌రాజు ఆడగగానే రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారు? దిల్‌రాజు ఎంత ముట్టజెప్పారు?” అని రసమయి ప్రశ్నించారు. 


Related Post

సినిమా స‌మీక్ష