వివాదస్పద వ్యాఖ్యలు చేసేవారిలో నటుడు సిద్దార్ధ్ కూడా ఒకరు. అతను హీరోగా చేసిన ‘మిస్ యూ’ సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. కనుక ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమిళ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజా ఇంటర్వూలో, “పాట్నాలో జరిగిన పుష్ప-2 ఈవెంట్‌కి 3-4 లక్షల మంది జనాలు తరలి రావడం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, సిద్దార్ధ్ అలవాటు ప్రకారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“ఈరోజుల్లో జేసీబీతో రోడ్డు తవ్వుతున్నా అది చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. అలాంటప్పుడు అల్లు అర్జున్ వస్తే చూసేందుకు జనాలు ఎగబడరా?అయినా ఆ ఈవెంట్ నిర్వాహకుల మేనేజ్ చేయడం వల్లనే అంతమంది జనాలు వచ్చారు. ఓ బిర్యానీ, ఓ క్వార్టర్ ఇస్తే చాలు జనాలు వస్తారు. దేశంలో రాజకీయ పార్టీ సభలకి అలాగే జనాలను తెచ్చుకుంటారు. కానీ సభలకి జనాలు వచ్చినంత మాత్రాన్న అన్ని పార్టీలు ఎన్నికలలో గెలుస్తాయా? లేదు కదా. నిర్వాహకులు జనసమీకరణ చేయడం వల్లనే పాట్నా ఈవెంట్‌కి అంతమంది వచ్చారు. వారంతట వచ్చినవారు తక్కువే ఉంటారు,” అని సిద్దార్ధ్ అన్నారు.
ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు భగ్గుమంతున్నారు. సిద్దార్ధ్ నువ్వు ఐటం సాంగ్ చేసినా నీ సినిమాలు చూసేందుకు జనాలు రారు. అల్లు అర్జున్‌తో నీకు పోలికా?” అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.