రాబిన్‌హుడ్‌లో కేతికా శర్మ స్పెషల్ సాంగ్.. రేపే

December 08, 2024


img

నితిన్, శ్రీలీల జంటగా చేస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమాలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేయబోతోందని తెలియజేస్తూ నేడు ఓ పోస్టర్ విడుదల చేశారు. దానిలో పూలజడ వేసుకొని వయ్యారంగా నిలుచుండగా ఆమెను వెనుకవైపు నుంచి చూపారు. సోమవారం ఉదయం 10.08 గంటలకు హాట్ సర్ప్రైజ్ అంటూ హింట్ ఇచ్చారు. అంటే ఆ పాటని రేపు ఉదయం విడుదల చేయబోతున్నారన్న మాట.   

వెంకీ కుడుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాబిన్ హుడ్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. 

ఈ సినిమా డిసెంబర్‌ 20వ తేదీన విడుదలచేయాలనుకున్నారు. కానీ డిసెంబర్‌ 5న పుష్ప-2 వస్తుండటంతో దానికి మరికాస్త దూరంగా జరిగి క్రిస్‌మస్‌ రోజున అంటే డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష