పుష్ప-2తో సూపర్ డూపర్ హిట్ కొట్టి జాతీయ స్థాయిలో తనకంటూ మరోసారి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలలో ది గర్ల్ ఫ్రెండ్ అనే మరో సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ప్రమో విడుదలైంది. ఈ నెల 9న టీజర్ విడుదల కాబోతోంది.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.