సమంత తండ్రి జోసఫ్ ప్రభు మృతి

November 29, 2024


img

ప్రముఖ నటి సమంత తండ్రి జోసఫ్ ప్రభు శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తన అభిమానులకు తెలియజేశారు. జోసఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్. ఆయన కేరళకు చెందిన నినెట్‌ని వివాహం చేసుకున్నారు. సమంత కుటుంబం సామాన్య మద్యతరతికి చెందినది కావడంతో ఆర్ధికంగా ఇబ్బంది పడేవారు. 

అప్పుడు సమంతకు ఉన్నత చదువు కోవాలని చాలా కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితిని చూసి ఆమె పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ తల్లితండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ తర్వాత తాను మోడలింగ్ వైపు పయనిస్తుంటే తల్లి తండ్రులు తప్ప బంధుమిత్రులు అందరూ ఆక్షేపించేవారని సమంత స్వయంగా చెప్పారు. 

తల్లి తండ్రులతో సమంతకు చాలా బలమైన అనుబంధం ఉందని ఆమె సన్నిహితులు చెపుతుంటారు. ముఖ్యంగా తండ్రి జోసెఫ్ ప్రభుతో ఆమెకు చాలా అనుబందం ఉండేదని చెపుతుంటారు. 

అంతగా ప్రేమించిన తండ్రి ఇప్పుడు లేరని తెలిసినప్పుడు ఆమె ఎంతగా దుఃఖిస్తున్నారో ఊహించుకోవచ్చు. తండ్రి మరణ వార్తని తెలియజేస్తూ ఆమె పెట్టిన చిన్న మెసేజ్ చూస్తే అది అర్దమవుతుంది. “మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు సెలవు నాన్న,” అంటూ సమంత పెట్టిన మెసేజ్ పెట్టారు. 


Related Post

సినిమా స‌మీక్ష