నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, నాని సినీ ప్రస్థానంలో ఆ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది కూడా. కనుక మళ్ళీ వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. వారిద్దరూ కలిసి ‘ప్యారడైజ్’ అనే సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్ర కాస్త భిన్నంగా ఉంటుందట. దీని కోసం సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుని సంప్రదించగా ఆయన ఓకే చెప్పారు. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా చేయబోతున్నారు. ఆమె నాని తల్లి పాత్ర చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా గురించి క్లుప్తంగా చెపుతూ హింస, రక్తపాతం, తుపాకులు, గ్లోరీ, ఒక మనిషి కధ అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టైటిల్ లుక్ పోస్టర్లోనే చెప్పేశారు.
సుధాకర్ ఈ సినిమాని కూడా దసరా సినిమా నిర్మాత చెరుకూరి ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అంటే నాని, దర్శకుడు, నిర్మాత ముగ్గురి కాంబినేషన్ రిపీట్ అవుతోందన్న మాట!